Lumba Oran: మద్యం తాగించి, మత్తుమాత్రలు ఇచ్చి... భర్తను హతమార్చిన భార్య!

Lumba Oran Wife Murders Husband with Lover in Jharkhand
  • ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఘటన
  • ప్రియుడు ఇర్ఫాన్‌తో కలిసి భర్త లుంబా ఓరాన్‌ను హత్య చేసిన గీతా దేవి
  •  గీతా దేవి, ఇర్ఫాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
ఝార్ఖండ్‌లో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. లుంబా ఓరాన్‌ అనే వ్యక్తిని అతని అర్ధాంగి గీతా దేవి, ఆమె ప్రియుడు ఇర్ఫాన్ అన్సారీ కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం, నిద్రమాత్రలు అధికంగా ఇచ్చి మత్తులో ఉండగా కారులో గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని జాతీయ రహదారిపై పడేసి పరారయ్యారు.

హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

రాంచీలో నివాసముండే లుంబా ఓరాన్‌ అర్ధాంగి గీతా దేవి గత కొన్నాళ్లుగా ఇర్ఫాన్ అన్సారీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లుంబా పలు సందర్భాల్లో గీతాదేవిని మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని భావించిన గీతా దేవి తన ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేసేందుకు పథకం వేసింది.

హత్య వివరాలు

ఈ నెల 20న లుంబాకు విపరీతంగా మద్యం తాగించిన ఇర్ఫాన్.. మత్తు మందు కలిపిన పానీయాన్ని తాగించాడు. వీటికి తోడు దాదాపు 10–15 నిద్రమాత్రలు కూడా ఇచ్చాడు. దీంతో అపస్మార స్థితిలోకి చేరుకున్న లుంబాను కారులోకి ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత కారులో అతని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని జాతీయ రహదారిపై పడేసి పరారయ్యాడు.

పోలీసుల దర్యాప్తు – అరెస్టులు

కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కీలక ఆధారాల ఆధారంగా గీతా దేవి, ఇర్ఫాన్ అన్సారీని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితురాలు తన భర్త కదలికలను గమనించేందుకు సీసీటీవీ కెమెరా కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. పోలీసులు నిందితుల నుంచి కారు, బైక్, సెల్‌ఫోన్లు, మద్యం సీసాలు, నిద్రమాత్రల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 
Lumba Oran
Jharkhand crime
wife murders husband
extra marital affair
Geeta Devi
Irfan Ansari
Ranchi murder
national highway
police investigation
sleep pills

More Telugu News