Woman Suicide Attempt: టీవీ సీరియల్ కోసం భర్తతో గొడవ.. కుమారుడితో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

Woman attempts suicide with son after fight over TV serial
––
టీవీ సీరియల్ చూసే విషయంలో భర్తతో గొడవపడ్డ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త బయటకు వెళ్లిన సమయంలో తాను పురుగుల మందు తాగడంతో పాటు కుమారుడితోనూ తాగించింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ రైతు గురువారం రాత్రి పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. అన్నం పెట్టమని భార్యను అడగగా.. టీవీ సీరియల్ చూస్తున్న భార్య కొద్దిసేపు ఆగాలని, సీరియల్ అయిపోయాక వడ్డిస్తానని బదులిచ్చింది.

ఇదికాస్తా భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసింది. శుక్రవారం ఉదయం కూడా గొడవ పడిన భర్త పొలం పనుల కోసం బయటకు వెళ్లాడు. భర్తతో గొడవ కారణంగా మనస్తాపం చెందిన భార్య ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడికీ తాగించింది. కుటుంబ సభ్యులు గమనించి ఇద్దరినీ మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ కోలుకుంటోందని, బాలుడి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Woman Suicide Attempt
Mahabubabad
TV serial
domestic dispute
Telangana news
son
poison
Bayyaram

More Telugu News