Swara Bhaskar: డింపుల్ యాదవ్‌పై క్రష్.. వివాదంపై స్పందించిన బాలీవుడ్ నటి స్వర భాస్కర్

Swara Bhaskar Responds to Dimple Yadav Crush Controversy
  • డింపుల్ యాదవ్‌పై తనకు క్రష్ ఉందంటూ నటి స్వర భాస్కర్ వ్యాఖ్య
  • సోషల్ మీడియాలో నటిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్
  • ఆమె అందం, హుందాతనాన్ని మాత్రమే మెచ్చుకున్నానన్న స్వర
  • తనను విమర్శించడం మాని, దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు
  • 'ఓట్ల చోరీ' లాంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరగాలని సూచన
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌పై తాను చేసిన వ్యాఖ్యల విషయమై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్‌పై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఘాటుగా స్పందించారు. తనను విమర్శించడం మాని, దేశంలో ఉన్న తీవ్రమైన సమస్యలపై దృష్టి పెట్టాలని ఆమె హితవు పలికారు.

వివరాల్లోకి వెళితే... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వర భాస్కర్‌కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'అమ్మాయిలలో మీ క్రష్ ఎవరు?' అని అడగ్గా, ఆమె ఏమాత్రం సంకోచించకుండా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పేరు చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వ్యాఖ్యల అనంతరం పలువురు నెటిజన్లు స్వర భాస్కర్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన స్వర, తాను డింపుల్ యాదవ్ అందాన్ని, హుందాతనాన్ని మాత్రమే ప్రశంసించానని స్పష్టం చేశారు. ఒక రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడి భార్యగా ఆమె వ్యవహరించే తీరు ఎంతో హుందాగా ఉంటుందని, ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని తాను ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు తెలిపారు.

అంతటితో ఆగకుండా, తన వ్యాఖ్యల్లో తప్పులు వెతకడానికి సమయం వృథా చేసే బదులు దేశంలో జరుగుతున్న 'ఓట్ల చోరీ' వంటి తీవ్రమైన సమస్యలపై దృష్టి సారించాలని ట్రోలర్లకు ఆమె గట్టిగా సూచించారు. అనవసర విషయాలపై కాకుండా, ప్రజా ప్రాముఖ్యత ఉన్న అంశాలపై చర్చ జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే ఇంటర్వ్యూలో మనుషులంతా సహజంగా బైసెక్సువల్స్ (ద్విలింగ సంపర్కులు) అని, అందుకే వారికి అబ్బాయిలతో పాటు అమ్మాయిలపైనా ఇష్టం ఉంటుందని స్వర వ్యాఖ్యానించడం గమనార్హం.

Swara Bhaskar
Dimple Yadav
Samajwadi Party
Akhilesh Yadav
Bollywood actress
controversy
social media trolling
India politics
bisexual
vote theft

More Telugu News