Tanguturi Prakasam Pantulu: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకి చంద్రబాబు, జగన్ నివాళులు

Chandrababu Jagan Tribute to Tanguturi Prakasam Pantulu
  • నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
  • తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు ప్రకాశం పంతులన్న చంద్రబాబు
  • ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పాలకులతో పోరాడిన యోధుడు టంగుటూరి అన్న జగన్
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు.

తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరి అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు.. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన ప్రకాశం పంతులు ప్రజాసేవను, దేశభక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందామన్నారు.

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్పూర్తిగా నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. 
Tanguturi Prakasam Pantulu
Andhra Kesari
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
Freedom Fighter
Chief Minister
Independence Day India

More Telugu News