Chandrababu Naidu: సురవరం మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

Chandrababu Naidu Expresses Condolences on Suravaram Sudhakar Reddy Death
  • సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
  • సుధాకర్ రెడ్డి మరణవార్త తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందన్న సీఎం చంద్రబాబు
  • ఏ పదవిలో ఉన్నా విలువలతో రాజీపడకుండా పని చేశారని కొనియాడిన చంద్రబాబు
కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు. అనునిత్యం ప్రజల గురించి ఆలోచించి వారి కోసమే పని చేసే సుధాకర్ రెడ్డి ఇకలేరు అంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. సమకాలీన రాజకీయ నాయకుడిగా ఆయనతో కలిసి పనిచేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు.

కమ్యూనిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ కార్యదర్శి స్థాయికి చేరారని కొనియాడారు. ఏ పదవిలో ఉన్నా విలువలతో రాజీపడకుండా పనిచేశారని అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 
Chandrababu Naidu
Suravaram Sudhakar Reddy
Andhra Pradesh
CPI
Communist Party of India
political leader
condolences
political news
Telugu news

More Telugu News