Mega 157: ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. 'మన శంకర వరప్రసాద్ గారు' వచ్చేశారు!
- చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో 'మెగా 157'
- చిరు బర్త్ డే స్పెషల్‌గా మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదల
- ఈ సినిమాకి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్
- స్టైలిష్ లుక్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ భారీ ప్రాజెక్టు (మెగా 157) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు చిరు బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకి 'మన శంకరవరప్రసాద్ గారు' అనే ఆసక్తికర టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. 'పండగకి వస్తున్నారు..' అనేది ట్యాగ్‌లైన్. ఇక, ఈ గ్లింప్స్‌కు విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఫుల్ సెక్యూరిటీ మధ్య మెగాస్టార్ ఎంట్రీ అదిరిపోయింది. చిరంజీవి స్టైలిష్ లుక్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు.
ఈ మూవీలో వెంకీ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల దీనిని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.