Bhadrachalam: భద్రాచలం వద్ద 51.8 అడుగులకు చేరిన నీటిమట్టం
- భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులపై చేరిన నీరు
- పలు ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు
- 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 51.8 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద, కురుస్తున్న విస్తారమైన వర్షాల కారణంగా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం క్రమంగా పెరుగుతూ గురువారం సాయంత్రానికి 52 అడుగులకు చేరువైంది. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద వరద ఉద్ధృతి అధికంగా ఉంది.
గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్, చర్ల, దుమ్ముగూడెం, కూనవరం రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.