Volodymyr Zelensky: ద్వైపాక్షిక చర్చలకు రష్యా సానుకూలంగా స్పందించకపోతే..!: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

Volodymyr Zelensky urges US intervention if Russia rejects talks
  • అమెరికా కలుగజేసుకొని గట్టిగా స్పందించాలన్న జెలెన్‌స్కీ
  • రష్యా ఎలాంటి రాయితీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందో స్పష్టత లేదన్న జెలెన్‌స్కీ
  • రష్యా దాడిలో అమెరికన్లతో సహా పలువురు గాయపడ్డారన్న జెలెన్‌స్కీ
రష్యా ద్వైపాక్షిక చర్చలకు సానుకూలంగా స్పందించని పక్షంలో అమెరికా జోక్యం చేసుకుని గట్టిగా స్పందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. భూభాగం విషయంలో రష్యా ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందో అన్న విషయంపై స్పష్టత లేదని ఆయన అన్నారు. తమ ప్రతిపాదన ఏమిటో తెలియాలంటే ముందు మాస్కో తన అభిప్రాయం వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు.

జకర్‌పట్టియ ప్రాంతంలో రష్యా జరిపిన దాడిలో అమెరికన్లతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారని జెలెన్‌స్కీ తెలిపారు. ఈ యుద్ధాన్ని ముగించేందుకు అర్థవంతమైన చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారా అనే విషయంలో ఎటువంటి సంకేతాలు వెలువడలేదని అన్నారు.

ఈ నేపథ్యంలో బలమైన ఒత్తిడి, ఆంక్షలు, టారిఫ్‌లు అవసరమని అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షిక చర్చల అంశంపై తాము తొలుత అంగీకారం తెలిపినప్పటికీ రష్యన్లు సిద్ధంగా లేరని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అదే సమయంలో చర్చలకు వేదికగా ఎంపిక చేసిన బుడాపెస్ట్ కూడా ఒక సవాలే అని ఆయన అభిప్రాయపడ్డారు.
Volodymyr Zelensky
Ukraine
Russia
Russia Ukraine conflict
Bilateral talks
US intervention
Zakarpattia region
War sanctions
Budapest

More Telugu News