Anupama Parameswaran: అనుపమా పరమేశ్వరన్: గెలవాలంటే పోరాడాల్సిందే!

Anupama parameshwaran Special
  • డిఫరెంట్ రోల్స్ చేస్తున్న అనుపమ 
  • ఇటు నటన .. అటు గ్లామర్ 
  • రేపు రిలీజ్ అవుతున్న 'పరదా'
  • ఆసక్తిని రేపుతున్న కంటెంట్

హీరోయిన్ అంటే గ్లామరస్ గా కనిపించాలి. రొమాంటిక్ సాంగ్స్ లో .. సీన్స్ ఆ గ్లామర్ మోతాదును మరి కాస్త పెంచాలి. అందుకు సిద్ధమైతేనే కొన్ని ప్రాజెక్టులు దక్కుతాయి. కుదరదంటే వచ్చే ప్రాజెక్టులు కూడా వెనక్కి పోతాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరి కోసం ఏదీ ఆగదు. పరిగెత్తే ఈ దారిలో మనం ఎంతవరకూ పనికొస్తామో పరీక్షించుకోవడమే జీవితం. 

ప్రస్తుతం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అలాగని చెప్పి ఆమె ఇండస్ట్రీకి వచ్చింది నిన్ననో మొన్ననో కాదు. దాదాపు పదేళ్లు అవుతోంది. అయితే ఎలాంటి రోల్స్ చేయాలనే ఒక కన్ఫ్యూజన్ మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తోంది .. గ్లామర్ కోటాను పెంచుతోంది. ఒక నిత్యా మీనన్ .. సాయి పల్లవి మాదిరిగా ఒక సూత్రంపై మాత్రం ఆమె ఆధారపడటం లేదు. 

ఒకసారి బరిలోకి దిగిన తరువాత గెలవాలి .. గెలవాలంటే పోరాడాలి అన్నట్టుగానే ఆమె ముందుకు దూసుకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె 'పరదా' అనే సినిమా చేసింది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రం, రేపు థియేటర్లకు రానుంది. కథ - పాత్ర పరంగా చూసుకుంటే, ఇది అనుపమ చేయగలిగిన సినిమానే అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఆమెకి పేరు తెస్తుందా? పేరుతో పాటు సక్సెస్ ను తీసుకొస్తుందా? అనేది చూడాలి. 
Anupama Parameswaran
Anupama Parameswaran movie
Parada movie
Praveen Kandregula
Telugu cinema
Tollywood
heroine roles
glamour roles
Nithya Menen
Sai Pallavi

More Telugu News