Chandrababu Naidu: ఇవాళ సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Visit Delhi Today
  • రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం
  • రాష్ట్రానికి నిధుల కోసం విజ్ఞప్తి చేయనున్న ముఖ్యమంత్రి
  • ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో పాల్గొననున్న చంద్రబాబు
  • రేపు రాత్రే అమరావతికి తిరిగి రాక
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. సాస్కి తో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. 

రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్ లో 'ఎకనమిక్ టైమ్స్' నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అదే రోజు రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Nirmala Sitharaman
Union Finance Minister
Delhi Visit
Economic Times
World Leaders Forum
Central Funds
AP Development

More Telugu News