Raj Kesi Reddy: మద్యం కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
--
మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ1 గా ఉన్న రాజ్ కెసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం విధాన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడడం ద్వారా కెసిరెడ్డి సుమారు రూ.13 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కెసిరెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల పేర్లతోనూ ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.