విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్.. ప్రతిపాదిస్తూ సంతకం చేసిన సోనియా
- ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి
- ఆయన పేరును ప్రతిపాదించిన సోనియాగాంధీ సహా 20 మంది ఎంపీలు
- తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామం. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన, న్యాయవ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. 2005 నుంచి 2007 వరకు గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 2007 నుంచి 2011 వరకు సుమారు నాలుగున్నరేళ్ల పాటు సేవలందించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి పదవీ విరమణ చేశాక, గోవా రాష్ట్రానికి లోకాయుక్తగా కూడా ఆయన పనిచేశారు.
జగదీప్ ధన్ఖడ్ ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను నిలిపిన సంగతి విదితమే.