Miyapur Suicide: మియాపూర్ లో విషాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి అనుమానాస్పద మృతి!

Miyapur Tragedy Family of Five Commits Suicide
  • స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
  • మృతులలో రెండేళ్ల చిన్నారి కూడా 
  • పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి మృతదేహాల తరలింపు 
హైదరాబాద్‌లోని మియాపూర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం చుట్టుపక్కల వారిని కంటతడి పెట్టిస్తోంది. 

స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో మృతదేహాలను పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పసికందును చంపేసి మిగిలిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

అయితే, ఈ దారుణానికి కారణమేంటనే విషయం తెలియరాలేదని, ఘటనా స్థలంలో ఎలాంటి లేఖ లభించలేదని సమాచారం. మరణించిన వారిని లక్ష్మయ్య (60), వెంకటమ్మ(55), అనిల్‌ (32), కవిత (24), అప్పు (2) గా గుర్తించారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి నుంచి హైదరాబాద్ కు ఈ కుటుంబం వలస వచ్చిందని పోలీసులు తెలిపారు.

చందానగర్ లో నాలాలో మృతదేహం
చందానగర్‌లోని ఓ నాలాలో మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికి తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం చేతిపై నర్సమ్మ అనే పచ్చబొట్టు ఉందని చెప్పారు. మృతదేహంపై ఓ పర్సు, అందులో కమ్మలు, బ్రాస్ లెట్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Miyapur Suicide
Hyderabad
Family Suicide
Makt Mahaboobpet
Lakshmaiah
Chandannagar
Narsamma

More Telugu News