Hyderabad: శాల‌రీ అడిగితే.. రాత్రికి రాత్రే జాబ్ నుంచి తీసేశారు: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆవేద‌న‌

Software Employees Allege Job Termination Over Salary Dispute
  • జీతం అడిగితే.. ఉద్యోగుల‌ను కంపెనీ నుంచి తీసుకొచ్చి పీఎస్‌లో కూర్చొబెట్టిన వైనం
  • ఉప్ప‌ల్ ఐడీఏలోని ఫ్రూజెస్ ఐటీ స‌ర్వీసెస్ ఇండియా కంపెనీ నిర్వాకం
  • ఉద్యోగులు గొడ‌వ చేయ‌డంతోనే కంపెనీ ఫిర్యాదు చేసింద‌న్న‌ పోలీసులు
శాల‌రీ అడిగినందుకు కంపెనీ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేష‌న్‌లో కూర్చొబెట్టార‌ని, రాత్రికి రాత్రే జాబ్ నుంచి తీసేశార‌ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న ఉప్ప‌ల్ పీఎస్ ప‌రిధిలో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకి వెళితే.. ఉప్ప‌ల్ ఐడీఏలోని ఐటీ పార్కులో ఫ్రూజెస్ ఐటీ స‌ర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నారు. మంగ‌ళ‌వారం నాడు డ్యూటీ ఉన్న స‌మ‌యంలో జులై నెల‌కు సంబంధించిన జీతాలు ఎప్పుడు ఇస్తార‌ని యాజ‌మాన్యాన్ని అడిగిన‌ట్లు వారు తెలిపారు. అంతే.. వెంట‌నే కంపెనీకి పోలీసుల‌ను ర‌ప్పించి 14 మంది ఉద్యోగుల‌ను ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్‌కు తీసుకొచ్చార‌న్నారు. 

బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు త‌మ‌ను పీఎస్‌లోనే కూర్చొపెట్టి మ‌నోవేద‌న‌కు గురిచేశార‌ని వారు వాపోయారు. అయితే, ఉద్యోగులు గొడ‌వ చేయ‌డంతోనే కంపెనీ యాజ‌మాన్యం ఫిర్యాదు చేసింద‌ని పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేర‌కే ఉద్యోగుల‌ను పీఎస్‌కు తీసుకొచ్చామ‌న్నారు.   
Hyderabad
Software Employees
Uppal
Fruges IT Services India Private Limited
Hyderabad IT Sector
Software Job Loss
Salary Issues
Outsourcing Employees
Police Station
Employee Rights

More Telugu News