Udaya Bhanu: పవన్ సినిమాలో యాక్ట్ చేయమని అడిగారు... కానీ!: యాంకర్ ఉదయభాను

Udaya Bhanu Reveals Missed Pawan Kalyan Movie Opportunity
  • అత్తారింటికి దారేది'లో స్పెషల్ సాంగ్ ఆఫర్
  • పెద్ద స్టార్ల మధ్య నటించడానికి ఇబ్బంది వల్లే నో చెప్పానన్న ఉదయభాను
  • ఇండస్ట్రీలో తనను తొక్కేశారని సంచలన ఆరోపణలు
  • త్వరలోనే వారి పేర్లు బయటపెడతానంటూ హెచ్చరిక
  • తన అనుభవాలతో ఓ పుస్తకం రాస్తున్నట్లు వెల్లడి
  • ఆగస్టు 22న 'త్రిబాణధారి బార్బరిక్' చిత్రంతో రీఎంట్రీ
ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'అత్తారింటికి దారేది'లో వచ్చిన ఓ కీలక అవకాశాన్ని వదులుకున్నట్లు తాజాగా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా పంచుకున్నారు.

ఆగస్టు 22న 'త్రిబాణధారి బార్బరిక్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'అత్తారింటికి దారేది' చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం తనను సంప్రదించారని, అయితే అంత పెద్ద స్టార్ల మధ్య నటించడానికి తాను ఇబ్బందిగా ఫీల్ అవ్వడంతో ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. యాంకర్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా, వాటిని వదులుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇదే సమయంలో, టాలీవుడ్‌లో కొందరు తనను కావాలనే పక్కనపెట్టారని ఉదయభాను సంచలన ఆరోపణలు చేశారు. కొందరు యాంకర్లు ఒక గ్రూపుగా ఏర్పడి తనకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని ఆమె గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నో ఈవెంట్‌లకు అన్నీ సిద్ధమయ్యాక, చివరి నిమిషంలో తనను తప్పించి వేరొకరికి అవకాశం ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చేదు అనుభవాలన్నింటినీ గుణపాఠంగా స్వీకరించానని, వీటన్నింటినీ వివరిస్తూ త్వరలో ఒక పుస్తకం కూడా రాయనున్నట్లు ఉదయభాను స్పష్టం చేశారు.
Udaya Bhanu
Attarintiki Daredi
Pawan Kalyan
Anchor Udaya Bhanu
Telugu Cinema
Tribanadhari Barbarik
Tollywood
Telugu Film Industry
Special Song Offer

More Telugu News