Botsa Satyanarayana: రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana Slams State Government No One Is Happy
  • విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చి, అమ్మే కుట్ర చేస్తున్నారన్న బొత్స
  • 'సూపర్ సిక్స్' పథకాల అమలులో స్పష్టత లేదని వ్యాఖ్య
  • అర్హులకు పింఛన్లు, సంక్షేమ పథకాలు అందట్లేదని ఆరోపణ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ఏ వర్గం కూడా ప్రభుత్వ పనితీరుతో సంతోషంగా లేదని ఆయన విమర్శించారు. 

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విషయంలో తమకు రెండు నాల్కల ధోరణి లేదని బొత్స స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ప్లాంట్ అప్పులు తీర్చిన తర్వాత దాన్ని ప్రైవేటుకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పర్యటనల్లో చంద్రబాబు ఈ కీలక అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

అదేవిధంగా, ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన 'సూపర్ సిక్స్' పథకాల అమలులో స్పష్టత కొరవడిందని బొత్స విమర్శించారు. సరైన కారణాలు లేకుండా అర్హులైన వితంతువులు, వికలాంగులకు పింఛన్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. 'తల్లికి వందనం' వంటి పథకాల్లోనూ కోతలు పెడుతున్నారని, ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
Botsa Satyanarayana
Andhra Pradesh
Visakha Steel Plant
Privatization
Chandrababu Naidu
Super Six Schemes
Pension Cuts
Telugu News
AP Politics
YSRCP

More Telugu News