Madhu Goud: వేశ్యతో గొడవపడ్డ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి.. ఏడుగురి అరెస్ట్

Software Employee Stabbed After Argument with Prostitute in KPHB
  • కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1లో టెక్కీపై కత్తితో దాడి
  • రవళి అనే వేశ్యతో గొడవ పడ్డ టెక్కీ
  • తన సోదరుడికి సమాచారం అందించిన రవళి
  • గన గ్యాంగ్ తో వచ్చి టెక్కీపై దాడి చేసిన సోహైల్
  • ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేశ్యతో జరిగిన చిన్న గొడవ ఈ దారుణానికి దారితీసింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మధు గౌడ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి మంగళవారం కేపీహెచ్‌బీ ఒకటో నంబర్ రోడ్డులో రవళి అనే వేశ్యతో వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన సోదరుడైన సోహైల్‌కు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన సోహైల్, తన స్నేహితులతో కలిసి మధుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ప్లాన్ ప్రకారం, సోహైల్ తన గ్యాంగ్‌తో కలిసి అదే రోజు రాత్రి రోడ్ నంబర్ 1లోని గాంధీ విగ్రహం వద్ద మాటువేసి మధుపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మధు గౌడ్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో రవళి, సోహైల్‌తో పాటు గూడెల్లి సాయికుమార్, బారెడ్డి శశిధర్‌రెడ్డి, బారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అశ్విని కుమార్ సింగ్, షేక్ షరీఫ్ ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Madhu Goud
KPHB
KPHB Police
attack on software employee
prostitute
Sohail
cyberabad crime
crime news hyderabad
knife attack
Ravali

More Telugu News