‘ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రుల తొలగింపు బిల్లు’ పై ప్రతిపక్షాల ఫైర్
- రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డ ప్రియాంకా గాంధీ
- నియంతృత్వ పోకడలకు దారితీసేలా ఉందని నేతల విమర్శ
- రాజకీయ ప్రత్యర్థుల నుంచి అధికారం లాక్కునే ఆయుధం
ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆమె ఆరోపించారు. రాజకీయ నేతల అవినీతిని అడ్డుకునేందుకే ఈ బిల్లు తెచ్చామంటూ బీజేపీ ప్రజల కళ్లకు గంతలు కడుతోందని విమర్శించారు. ప్రతిపాదిత బిల్లు చట్టంగా మారితే.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తప్పుడు కేసుతో 30 రోజులకు పైగా జైలులో పెట్టి బీజేపీ అధికారాన్ని లాక్కుంటుందని ప్రియాంక ఆరోపించారు. బిల్లు అప్రజాస్వామికమని, దురదృష్టకరమని ఆమె అన్నారు.