టాటా ఇన్నోవేషన్ హబ్ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
––
డీప్‌టెక్, కృత్రిమ మేధ, సుస్థిర, సమ్మిళిత ఆవిష్కరణలకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రామాణికంగా రూపొందిస్తామని ఆయన అన్నారు. సుమారు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.