Bandhavi Sridhar: నమ్ముతారా .. 'మసూద'లో భయపెట్టింది ఈ బ్యూటీనే!

Bandhavi Sridhar Special
  • 'మసూద' సినిమాతో గుర్తింపు 
  • ఆ సినిమాతో భయపెట్టిన బాంధవి 
  • సోషల్ మీడియాలో అందాల సందడి 
  • పెరుగుతున్న ఫాలోవర్స్ 
  • హీరోయిన్ గా కనిపించనుందంటూ టాక్    
'మసూద' సినిమా 2022లో థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాను చూసినవారు, అంత తొందరగా మరిచిపోలేరు. అందుకు కారణం .. ఆ సినిమా కంటెంట్ .. ఆ సినిమా టేకింగ్ అనే చెప్పాలి. ఆ తరువాత చెప్పుకోవలసింది, ఆ సినిమాలో దెయ్యం పట్టినట్టుగా నటించిన బాంధవి శ్రీధర్ గురించి. ఆ సినిమాలో ముద్దుగా .. బొద్దుగా కనిపిస్తూనే ఈ అమ్మాయి భయపెట్టేస్తుంది. ఈ అమ్మాయి ఎవరో మంచి ఆర్టిస్ట్ అవుతుందని అంతా అనుకున్నారు కూడా. అలాంటి బాంధవి శ్రీధర్ ఇప్పుడు కాస్త స్లిమ్ అయింది. యూత్ ఆశ్చర్యపడేలా కాస్త నాజూకుగా తయారైంది. ఆ సినిమాలో అంతగా భయపెట్టిన ఆ అమ్మాయేనా, ఇప్పుడు ఇలా కుర్రాళ్లకు కుదురు లేకుండా చేస్తోందని అనిపిస్తుంది. ఈ మధ్య బాంధవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. చీరకట్టులోను .. మోడ్రన్ డ్రెస్ లలోను వరుస ఫొటో షూట్ లతో తన జోరు చూపిస్తోంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రెండీ లుక్ తో కూడిన ఈ పిక్స్ లో ఆమె మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ పడుతున్నాయి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేయమని కుర్రాళ్లు ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే నిజంగానే బాంధవి త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ కాస్త బలంగానే వినిపిస్తోంది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు. హీరోయిన్ గా ఆమె ఎంట్రీ ఇచ్చే సమయం ఎంతో దూరంలో లేదని చెబుతున్నారు.

Bandhavi Sridhar
Masooda movie
Telugu cinema
Telugu actress
Slim look
Social media
Photo shoot
Heroine entry
Upcoming projects
Telugu movies

More Telugu News