Teacher attack: టీచర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్టూడెంట్.. మధ్యప్రదేశ్ లో దారుణం

Madhya Pradesh Student Sets Teacher Ablaze After Complaint
  • టీచర్ చీరపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విద్యార్థి
  • యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన టీచర్
  • వన్ సైడ్ లవ్.. తనపై ఫిర్యాదు చేసిందనే కోపంతో దాడి
మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనపై ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో ఓ విద్యార్థి క్లాస్ టీచర్ పై దాడి చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న టీచర్ పై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పి బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలు తీవ్రమైనవే అయినప్పటికీ టీచర్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ పూర్ జిల్లాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉతృష్ఠ విద్యాలయంలో 26 ఏళ్ల యువతి గెస్ట్ టీచర్ గా పనిచేస్తోంది. అదే స్కూలులో చదువుతున్న సూర్యవంశ్ కోచర్ (18) ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. సోమవారం స్కూలులో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించగా.. ఆ వేడుకలకు బాధిత టీచర్ చీర కట్టుకుని హాజరయ్యారు. ఈ సందర్భంగా టీచర్ చీరపై సూర్యవంశ్ అసభ్యకరమైన కామెంట్లు చేశాడని సమాచారం. బాధిత టీచర్ ఫిర్యాదుతో స్కూలు యాజమాన్యం సూర్యవంశ్ పై చర్యలు తీసుకుంది.

దీంతో టీచర్ పై కక్ష పెంచుకున్న సూర్యవంశ్.. మంగళవారం మధ్యాహ్నం టీచర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న టీచర్ ను పిలిచి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై చల్లి, నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో బాధితురాలికి 10 నుంచి 15 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయమేమీ లేదని పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సూర్యవంశ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Teacher attack
Madhya Pradesh crime
Student burns teacher
Narsinghpur incident
Molestation complaint
School teacher assaulted
Love affair crime
SuryaVansh Kochar
Crime news

More Telugu News