Rukmini Vasanth: ఇక రుక్మిణి వసంత్ ను అందుకోవడం కష్టమే!
- కన్నడలో బిజీగా రుక్మిణీ వసంత్
- 'కాంతార -1'లో దక్కిన 'కనకవతి' పాత్ర
- తమిళంలో చేసిన 'మదరాసి'
- రిలీజ్ కి రెడీ అవుతున్న యాక్షన్ థ్రిల్లర్
- రెండు సినిమాలపై భారీ అంచనాలు
కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు రుక్మిణి వసంత్. సింపుల్ గా కనిపిస్తూనే మనసులు కొల్లగొట్టడం ఈ బెంగుళూర్ బేబీ ప్రత్యేకత. యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి తగినట్టుగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు కన్నడ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 'కాంతార - ఛాప్టర్ 1'. రిషభ్ శెట్టి సరసన ఆమె 'కనకవతి' పాత్రలో కనిపించనుంది. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
'కాంతార - ఛాప్టర్ 1'లో రుక్మిణి పోషించిన 'కనకవతి' పాత్ర చాలాకాలం పాటు గుర్తుండి పోతుందని అంటున్నారు. ఈ సినిమా విషయంలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే రుక్మిణి రేంజ్ మారిపోతుందని అంటున్నారు. ఇతర భాషల్లోను ఆమె మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రుక్మిణి వసంత్ తమిళంలో 'మదరాసి' సినిమా చేసింది. తమిళంలో ఆమెకి ఇది రెండవ సినిమా. శివకార్తికేయన్ జోడీగా ఈ సినిమాలో ఆమె కనిపించనుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇలా రుక్మిణి వసంత్ చేసిన భారీ సినిమాలు రెండూ ఒక నెల తేడాతో విడుదలవుతున్నాయి. ఈ సినిమాలు హిట్ అయితే, ఇక ఆమె డేట్స్ దొరకడం కష్టమేనని అంటున్నారు.