Rashmika Mandanna: ర‌ష్మిక హారర్ చిత్రం ‘థామా’ టీజర్ చూశారా?

Rashmika Mandanna Thama Movie Teaser Released
  • ర‌ష్మిక మంద‌న్న, ఆయుష్మాన్‌ ఖురానా జంట‌గా ‘థామా’
  • ఈ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందు‌కు రానున్న‌ హార‌ర్ కామెడీ చిత్రం
  • తాజాగా మూవీ నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌
నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న, ఆయుష్మాన్‌ ఖురానా జంట‌గా న‌టిస్తున్న తాజా హార‌ర్ కామెడీ చిత్రం ‘థామా’.   నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, పరేశ్‌ రావల్ ఇత‌ర ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రం దీపావ‌ళి కానుకగా విడుద‌ల కానుంది. తాజాగా మూవీ నుంచి మేక‌ర్స్‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్ చూస్తుంటే.. అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్‌, కామెడీ చిత్రంగా రాబోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అదిరిపోయే బీజీఎం, విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. 

ఇక‌, ఈ సినిమాలో రష్మిక తడకా పాత్రలో క‌నిపించ‌బోతుండ‌గా.. ఆయుష్మాన్‌ ఖురానా అలోక్‌గా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ యక్షసాన్‌గా, పరేశ్‌ రావల్‌ రామ్‌ బజాజ్‌ గోయెల్‌గా క‌నిపించ‌బోతున్నారు. ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ లాంటి హారర్‌ కామెడీ చిత్రాలను తెర‌కెక్కించిన బాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ‌ మాడ్‌డాక్ ఫిలిమ్స్ ఈ క్రేజీ సినిమాను నిర్మించింది. ఆదిత్య సర్పోత్దార్‌ దర్శకత్వం వ‌హించారు.

Rashmika Mandanna
Thama movie
Ayushmann Khurrana
Nawazuddin Siddiqui
Paresh Rawal
Bollywood horror comedy
Maddock Films
Aditya Sarpotdar
Diwali release
horror comedy movies

More Telugu News