Bhagyashree Jadhav: మద్యం మత్తులో మహిళా కానిస్టేబుల్ ను ఈడ్చుకెళ్లిన ఆటోడ్రైవర్.. వీడియో ఇదిగో!

Auto Driver Drags Woman Constable in Satara Maharashtra
  • మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘటన
  • స్థానికులు వెంటపడి ఆటోను ఆపిన వైనం
  • డ్రైవర్ ను చితకబాది పోలీసులకు అప్పగించిన జనం
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. జరిమానా తప్పించుకోవడానికి ఆటోను ఆపకుండా తీసుకెళ్లాడు. అడ్డుపడిన మహిళా కానిస్టేబుల్ ను ఈడ్చుకుంటూ వెళ్లడంతో స్థానికులు వెంటపడి ఆటోను ఆపేశారు. డ్రైవర్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సతారా నగరంలోని ఓ కూడలి వద్ద సోమవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ ఆటోను మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ దేవ్ రాజ్ కాలే ఆటోను ఆపలేదు. అడ్డుపడిన భాగ్యశ్రీ జాదవ్ ను ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీంతో స్థానికులు ఆటోను వెంబడించి కొద్దిదూరంలో దానిని ఆపి, డ్రైవర్ ను చితకబాదారు. ఆటో డ్రైవర్ దేవ్ రాజ్ కాలేను అదుపులోకి తీసుకున్నామని, భాగ్యశ్రీ జాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Bhagyashree Jadhav
Maharashtra
Satara
Auto driver
Drunk driving
Woman constable
Traffic police
Viral video
Crime news

More Telugu News