Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

Rahul Sipligunj Engagement Details Revealed
  • హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యా రెడ్డిల నిశ్చితార్ధ వేడుక
  • కొత్త ఆరంభం అంటూ నిశ్చితార్ధం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన రాహుల్
  • నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తే హరిణ్యా రెడ్డి
ప్రముఖ గాయకుడు, నటుడు రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం తెలుగుదేశం పార్టీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తె హరిణ్యా రెడ్డితో జరిగింది. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో ఆత్మీయుల మధ్య సాదాసీదాగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ‘కొత్త ఆరంభం’ అంటూ రాహుల్‌ సిప్లిగంజ్‌ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు.

ఇటీవల తెలంగాణ సర్కార్ రాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.కోటి అందించిన విషయం తెలిసిందే. ఓల్డ్ సిటీలో ఓ సాధారణ యువకుడిగా ప్రారంభమై ఆస్కార్ వేదిక వరకు చేరుకున్న రాహుల్‌పై సీఎం రేవంత్ ‘గద్దర్ అవార్డు’ ప్రదానోత్సవంలో ప్రశంసలు కురిపించారు. ‘కాలేజ్ బుల్లోడా’, ‘వాస్తు బాగుందే’, ‘రంగా రంగా రంగస్థలానా’, ‘బొమ్మోలే ఉన్నదిరా పోరి’ వంటి సినిమాల పాటలు, ‘ఓ నా రాహులా’, బోనాలు, వినాయక చవితి స్పెషల్ సాంగ్స్‌తో శ్రోతల మనసులను గెలుచుకున్న రాహుల్‌, తాజాగా నటుడిగా కూడా ‘రంగమార్తాండ’ చిత్రంతో మెప్పించారు. అంతేకాక, ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కాలభైరవతో కలిసి పాడిన ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కడం రాహుల్‌కు గర్వకారణమైంది. 
Rahul Sipligunj
Rahul Sipligunj engagement
Harinya Reddy
Kotamreddy Srinivasulu Reddy
Telangana news
Naatu Naatu song
RRR movie
Tollywood singer
Gaddar Award
Rangamarthanda movie

More Telugu News