Kukatpally Girl Murder: కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు
- లైంగిక దాడి యత్నాన్ని బాలిక ప్రతిఘటించడంతోనే హత్య
- ఎదురు తిరగడంతో కత్తితో పొడిచిన దుండగుడు
- సీసీ కెమెరాల్లో రికార్డయిన నిందితుడి కదలికలు
- ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకొని రాక.. దగ్గరి వారేనని అనుమానం
- నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైంగిక దాడికి విఫలయత్నం చేయగా బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు, నిందితుడు తెలిసిన వ్యక్తే అయి ఉండవచ్చని బలంగా అనుమానిస్తున్నారు.
ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయం చూసి నిందితుడు అక్కడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా, బాలిక ప్రతిఘటించింది. ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన కీలక దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడు ఇంటికి వచ్చి వెళుతున్న కదలికలను పోలీసులు గుర్తించారు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉందని కచ్చితంగా తెలుసుకొని రావడం, ఆమె ప్రతిఘటించినప్పుడు దారుణంగా హత్య చేయడం వంటి పరిణామాలను బట్టి నిందితుడు బాధితురాలికి బాగా తెలిసిన వ్యక్తి లేదా దగ్గరి బంధువై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.