ఎలక్షన్ కమిషనర్ పై ఇండియా కూటమి కీలక నిర్ణయం!
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలంటూ పార్లమెంట్ లో కూటమి తీర్మానం!
- ఓట్ చోరీ ఆరోపణలతో ముదిరిన వివాదం
- రాహుల్ గాంధీకి వారం రోజుల అల్టిమేటం జారీ చేసిన సీఈసీ
సీఈసీ అల్టిమేటం..
ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అధికార ఎన్డీయే కూటమి ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర వివాదం రేపాయి. ఈ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఓట్ చోరీ అనే పదం ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించింది. ఎన్నికల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించడంతో పాటు డిక్లరేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇందుకు ఏడు రోజులు గడువు ఇస్తూ ఆలోగా డిక్లరేషన్ ఇవ్వకుంటే తన ఆరోపణలు తప్పని ఒప్పుకుంటూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీకి అల్టిమేటం జారీ చేశారు.