RTC bus accident: ఆర్టీసీ బస్సు ఢీ కొని ముగ్గురి దుర్మరణం.. సత్యసాయి జిల్లాలో ప్రమాదం

RTC Bus Accident Kills Three Tirumala Pilgrims in Andhra Pradesh
––
తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండిపల్లి వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RTC bus accident
Sathya Sai district
Andhra Pradesh accident
Tirumala devotees
Road accident India
Bus accident
Pilgrim death
Mandi Palli

More Telugu News