Manchu Avram: అవ్రామ్ కు పురస్కారం... మంచు విష్ణును ఉద్దేశించి మనోజ్ పోస్ట్

Manchu Avram Receives Award Manchu Manojs Post to Vishnu
  • సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ వేడుకల్లో అవార్డు అందుకున్న మంచు విష్ణు తనయుడు అవ్రామ్
  • ఎక్స్ వేదికగా అవ్రామ్ కు అభినందనలు తెలిపిన మంచు మనోజ్
  • మనోజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్  
ప్రముఖ నటుడు మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం ప్రేక్షకుల్ని మాత్రమే కాదు, విమర్శకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా ఆయన తనయుడు మంచు అవ్రామ్ వెండితెరకు పరిచయం కాగా, తాజాగా జరిగిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో అవ్రామ్‌కు ప్రత్యేక అవార్డు లభించింది.

ఈ సందర్భంగా అవ్రామ్ తన ఆనందాన్ని పంచుకుంటూ, “ఈ అవార్డు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తోంది. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్లీ మీ ముందుకు వస్తా” అంటూ చెప్పాడు. అవ్రామ్ అవార్డు స్వీకరిస్తున్నప్పుడు వేదికపై అతనితో పాటు తండ్రి విష్ణు, తాత మోహన్‌బాబు కూడా ఉండటం మరింత ప్రత్యేకతను చేకూర్చింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంచు మనోజ్.. అవ్రామ్‌ను అభినందిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. “కంగ్రాట్స్ అవ్రామ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే మరింత రాణించాలి నాన్న. విష్ణు అన్న, నాన్న మోహన్‌బాబుగారితో కలిసి నువ్వు అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం” అంటూ ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ముఖ్యంగా మంచు విష్ణు పేరు కోట్ చేస్తూ మనోజ్ పోస్టు పెట్టడంపై నెటిజన్లు స్పందిస్తూ “భయ్యా.. అంతా సర్దుకున్నట్టేనా?” అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. గతకొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో చోటుచేసుకున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గతంలో ‘కన్నప్ప’ మూవీ విడుదల సమయంలో మంచు మనోజ్ పోస్టులో విష్ణు పేరును ప్రస్తావించకపోవడం, కుటుంబంలో వున్న విభేదాలపై చర్చనీయాంశమైంది. ఇప్పుడు మాత్రం విష్ణును ఉద్దేశిస్తూ స్పష్టమైన సందేశం ఇవ్వడం, అభిమానుల్లో మంచు కుటుంబం మళ్లీ కలిసిపోతుందా? అనే ఆశలు రేకెత్తిస్తోంది.

ఇదే కొనసాగితే, త్వరలోనే మంచు కుటుంబం అన్ని విభేదాలను పక్కనబెట్టి మళ్లీ ఒక కుటుంబంగా ఎదురు పడే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 
Manchu Avram
Manchu Vishnu
Kannappa Movie
Manchu Manoj
Mohan Babu
Santosham Film Awards
Telugu Cinema
Tollywood
Family Reunion
Movie Award

More Telugu News