Vladimir Putin: ఇంగ్లీషులో మాట్లాడి ఆశ్చర్యానికి గురిచేసిన పుతిన్

Vladimir Putin Speaks English After Trump Meeting
  • మూడు గంటలకుపైగా చర్చలు జరిపిన డొనాల్డ్ ట్రంప్‌, పుతిన్
  • సమావేశంలో రష్యన్ భాషలోనే మాట్లాడిన పుతిన్
  • మీడియా సమావేశంలో పుతిన్ ఇంగ్లీష్‌లో మాట్లాడిన వైనం 
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తాజాగా మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. చర్చల అనంతరం మీడియా సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆంగ్లంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతకు ముందు చర్చల్లో ట్రంప్‌తో రష్యన్ భాషలో మాట్లాడిన పుతిన్ మీడియా సమావేశంలో మాత్రం ఆంగ్లంలో మాట్లాడటం కొందరికి ఆసక్తి కలిగించింది.

ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. పలువురు నెటిజన్లు పుతిన్‌కు ఎన్ని భాషలు వచ్చు అనే సందేహాలను వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పుతిన్‌కు ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉన్నప్పటికీ బహిరంగంగా లేదా అధికారిక సమావేశాల్లో మాత్రం ఆయన రష్యన్ భాషనే ఉపయోగించేవారని, అలాంటి సందర్భాలలో అనువాదకుల సహాయం తీసుకుంటారు. పత్రికా సమావేశాల్లోనూ ఆయన ఇదే రీతిగా వ్యవహరిస్తారు.

అయితే అంతర్గత సమావేశాల్లో మాత్రం ఆయన అప్పుడప్పుడూ ఆంగ్లంలోనూ మాట్లాడతారని రష్యా ప్రతినిధి ఒక సందర్భంలో తెలిపారు. కొన్ని సందర్భాల్లో అనువాదకుల తప్పులను కూడా ఆయన సరిచేసేవారని అన్నారు. పుతిన్‌కు రష్యన్ భాషతో పాటు జర్మన్ భాషపైనా మంచి పట్టు ఉందని, 1980లో తూర్పు జర్మనీలో నిఘా అధికారిగా ఉన్న సమయంలో ఆయన జర్మన్ భాషను నేర్చుకున్నారని అంటున్నారు.

గతంలో జర్మనీ ఛాన్సలర్‌తో దౌత్యపరమైన చర్చల్లో ఆయన జర్మనీలోనే మాట్లాడారని అంటున్నారు. తాజాగా ట్రంప్‌తో చర్చల తర్వాత మీడియా సమావేశంలో పుతిన్ అకస్మాత్తుగా ఆంగ్ల భాషలో మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 
Vladimir Putin
Putin
Russia
Ukraine
Donald Trump
Russia Ukraine war
Putin English
Russian President
US President

More Telugu News