Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రగడ్డ ముఖ్య నేతలతో మంత్రుల సమావేశం

Ponnam Prabhakar calls for Congress victory in Jubilee Hills by election
  • నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్న మంత్రులు
  • పార్టీ గెలుపు కోసం తగిన విధంగా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపు
  • అభ్యర్థి ఎవరైనా పార్టీ విజయం కోసం కృషి చేయాలన్న మంత్రులు
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలతో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావులు మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు తగిన విధంగా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

ఎర్రగడ్డ డివిజన్‌లో నేతలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. డివిజన్ బూత్ కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే రాష్ట్ర అభివృద్ధికి సంకేతమవుతుందని వ్యాఖ్యానించారు.
Ponnam Prabhakar
Jubilee Hills by election
Telangana politics
Erragadda division
Congress Party

More Telugu News