Javed Akhtar: దేశద్రోహులెవరో తెలుసుకో.. అజ్ఞానం తగ్గించుకో: నెటిజన్లకు జావెద్ అక్తర్ స్ట్రాంగ్ కౌంటర్

Javed Akhtar Slams Trolls on Independence Day Post
  • స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జావెద్ అక్తర్
  • "మీ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14 కదా" అంటూ ఓ నెటిజన్ కామెంట్
  • నా పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారంటూ ఘాటు జవాబు
ప్రముఖ సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు తన దేశభక్తిని ప్రశ్నించిన నెటిజన్లకు ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టుపై కొందరు చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో బదులిచ్చి వారి నోరు మూయించారు.

వివరాల్లోకి వెళితే, భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జావేద్ అక్తర్ ఒక పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్, "మీ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14 (పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం) కదా?" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యపై జావేద్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. "బాబు.. మీ తాతలు, తండ్రులు ఆంగ్లేయుల చెప్పుల కింద బానిసలుగా ఉన్నప్పుడు, నా పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం పోరాడి కాలాపానీ (అండమాన్) జైలులో ప్రాణాలు అర్పించారు. నీ హద్దుల్లో నువ్వుండు" అంటూ గట్టిగా బదులిచ్చారు.

ఈ సంభాషణ జరుగుతుండగానే మరో నెటిజన్ కలుగజేసుకుని, "కానీ, నువ్వు దేశద్రోహివే" అంటూ జావేద్ అక్తర్‌ను విమర్శించాడు. దీనికి కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా సమాధానం ఇచ్చారు. "సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాలను వ్యతిరేకించిన వారే దేశద్రోహులు. ఆంగ్లేయులకు చేతనైనంత సహాయం చేసిన వారే దేశద్రోహులు. మన రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించిన వారే దేశద్రోహులు. వాళ్లెవరో తెలుసుకుని నీ అజ్ఞానాన్ని కొద్దిగా తగ్గించుకో" అని ఆయన చురకలు అంటించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
Javed Akhtar
Javed Akhtar Independence Day
Javed Akhtar Pakistan
Indian Independence Day
Bollywood lyricist
social media
nationalism
Quit India movement
Indian constitution
tricolor flag

More Telugu News