Mahesh Kumar Goud: 'మార్వాడీ గో బ్యాక్', కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాలపై స్పందించిన టీపీసీసీ చీఫ్

Mahesh Kumar Goud Responds to Marwari Go Back Comments
  • మార్వాడీలు మనలో ఒకరు.. వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్న టీపీసీసీ చీఫ్
  • బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
  • రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలుసుకుంటామని వెల్లడి
"మార్వాడీ గో బ్యాక్" అంశంపై, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మార్వాడీలు మన దేశానికి చెందినవారని, వారంతా మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలుసుకుంటామని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని తెలిపారు. తనకు మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే పార్టీలో తిరిగి చేర్చుకున్నారని, తాను పార్టీలో చేరినప్పుడు ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామనే విషయం తెలియదా అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ పైవిధంగా స్పందించారు.
Mahesh Kumar Goud
TPCC Chief
Komati Reddy Rajagopal Reddy
Telangana Congress
Marwari Go Back

More Telugu News