Independence Day: నడుములోతు వరదలో జెండా వందనం.. వీడియో ఇదిగో!

Floods Did not Stop Independence Day Celebrations in Jharkhand
––
ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ జిల్లాలో భారీ వర్షాలతో వరద నీరు జనావాసాలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నడుములోతు వరకు చేరడంతో జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరద నీటిలోనే పలు పాఠశాలల్లో వేడుకలు నిర్వహించారు. నడుములోతు నీటిలో ఉపాధ్యాయులు, స్థానికులు, విద్యార్థులు జెండా వందనం చేశారు. జిల్లాలోని దియారా ప్రాంత పాఠశాలల్లో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సదర్‌ బ్లాకు పరిధిలోని కిషన్‌ ప్రసాద్‌ పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఛాతీ లోతు నీటిలో నిలబడి జెండా ఎగురవేసి.. జాతీయగీతం ఆలపించారు. ఖోక్లాసింగ్‌ టొలా రాంపుర్‌లో ఉపాధ్యాయుల సాయంతో విద్యార్థులు పడవలో స్కూలుకు వెళ్లి జెండా వందనం చేశారు. కాగా, బీహార్ లోని షేఖ్ పురాలోనూ పలువురు స్థానికులు వరద నీటిలోనే పతాకావిష్కరణ చేసి జాతీయగీతాలాపన చేశారు.

Independence Day
Jharkhand Floods
Sahibganj
India Independence Day
Flag Hoisting
Independence Day Celebrations
Bihar Floods
Shekhpura
India
Flooding

More Telugu News