Mahesh Babu: సెట్స్ నుంచి మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా ఫొటో లీక్

Mahesh Babu Priyanka Chopra photo leaked from sets
  • మహేశ్, ప్రియాంక కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
  • కీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంక చోప్రా
  • మహేశ్ బర్త్ డే వేడుకల్లో ప్రియాంక
సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్టేడ్ కూడా వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచాలని రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... తాజాగా సెట్ లోని ఒక ఫొటో లీక్ అయింది. 

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న షూటింగ్ సెట్ లో మహేశ్ బాబు పుట్టినరోజు వేడుకల్లో ప్రియాంక పాల్గొంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు, ప్రియాంక కలిసి దిగిన ఫొటో లీక్ అయింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్, ప్రియాంక ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఇదే తొలిసారి కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Mahesh Babu
Rajamouli movie
Priyanka Chopra
Mahesh Babu Rajamouli film
SS Rajamouli
Telugu cinema
Leaked photo
Movie set
Tollywood
Indian cinema

More Telugu News