Donald Trump: ఆ పని చేస్తే ట్రంప్ ను నోబెల్ కు నామినేట్ చేస్తా: హిల్లరీ క్లింటన్

Hillary Clinton says she will nominate Trump for Nobel if he ends Ukraine war
  • రష్యా– ఉక్రెయిన్ యుద్ధంపై హిల్లరీ సంచలన వ్యాఖ్యలు
  • అమెరికా విచ్ఛిన్నాన్ని కోరుకునే వ్యక్తి అంటూ పుతిన్ పై విమర్శ
  • 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై పోటీచేసి ఓడిపోయిన హిల్లరీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన రాజకీయ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అరుదైన ఆఫర్ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న ట్రంప్ కు తాను కూడా మద్దతు ప్రకటిస్తానని ఆమె చెప్పారు. అయితే, రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉక్రెయిన్ కు ఎలాంటి నష్టం లేకుండా ఆపాలని అన్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు ధారాదత్తం చేయకూడదని ఆమె కండిషన్ విధించారు. అలా చేయగలిగితే ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి తాను కూడా నామినేట్ చేస్తానని హిల్లరీ క్లింటన్ వివరించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ట్రంప్ భేటీకి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పుతిన్ పై, అలాస్కాలో జరిగిన వారిద్దరి భేటీపై విమర్శలు చేశారు. ట్రంప్ సమావేశం కాబోతున్న వ్యక్తి (పుతిన్) అమెరికాకు మిత్రుడు కాదని గుర్తుచేశారు. అమెరికాతో పాటు పాశ్చాత్య కూటమి విచ్ఛిన్నాన్ని కోరుకునే వ్యక్తి అని ఆరోపించారు. కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పై హిల్లరీ క్లింటన్ పోటీ చేసి ఓడిపోయారు.
Donald Trump
Hillary Clinton
Russia Ukraine war
Nobel Peace Prize
Vladimir Putin
US Elections 2016
Ukraine
Russia

More Telugu News