Nara Lokesh: కృష్ణుడు చూపిన బాటలో అందరూ నడవాలి: నారా లోకేశ్

Nara Lokesh Wishes on Sri Krishna Janmashtami
  • శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
  • వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన లోకేశ్
  • చివరి వరకు సిద్ధాంతాల కోసం బతికారని కితాబు
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడు అవతరించిన రోజు అని అన్నారు. శ్రీకృష్ణుడు చూపిన బాటలో అందరూ నడిచి, తమ జీవితాలను ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

మరోవైపు, దివంగత ప్రధాని వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు లోకేశ్ నివాళులు అర్పించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడిన వ్యక్తి వాజ్ పేయి అని కొనియాడారు. కష్టాలను ఓర్పుతో సహిస్తూనే అద్భుతమైన దార్శనికతను ప్రదర్శించారని కితాబునిచ్చారు. ఆర్థిక, మౌలిక సంస్కరణలతో దేశ రూపురేఖలు మార్చిన గొప్ప నేత వాజ్ పేయి అని పేర్కొన్నారు. తన ప్రసంగాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవారని అన్నారు. దేశానికి ప్రధానిగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
Nara Lokesh
Sri Krishna Janmashtami
AP Minister
Atal Bihari Vajpayee
Vajpayee death anniversary
Telugu News
Andhra Pradesh
Political News

More Telugu News