Donald Trump: ఇక బంతి జెలెన్‌స్కీ కోర్టులోనే.. పుతిన్‌తో భేటీ తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- అలాస్కాలో సమావేశమైన అమెరికా, రష్యా అధ్యక్షులు
- ఉక్రెయిన్ యుద్ధంపై మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు
- శాంతి ఒప్పందంపై లేని ఎలాంటి స్పష్టమైన పురోగతి
- భేటీకి 10కి 10 మార్కులు వేసిన డొనాల్డ్ ట్రంప్
- ఇక నిర్ణయం తీసుకోవాల్సింది జెలెన్‌స్కీనేనని వ్యాఖ్య
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీపైనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ సంక్షోభానికి ముగింపు పలకడంలో జెలెన్‌స్కీ చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం పుతిన్‌తో భేటీ ముగిసిన తర్వాత ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. "ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ఉంది. ఐరోపా దేశాలు కూడా ఇందులో కాస్త జోక్యం చేసుకోవాలి. కానీ ప్రధాన బాధ్యత జెలెన్‌స్కీదే" అని ఆయన అన్నారు. పుతిన్‌తో జరిగిన ఈ సమావేశానికి తాను 10కి 10 మార్కులు ఇస్తున్నానని, చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు.
అత్యంత కీలకంగా భావించిన ఈ సమావేశంలో ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ఇరు నేతల మధ్య ఎలాంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు. కాల్పుల విరమణపైనా ప్రకటన వెలువడలేదు. దాదాపు మూడు గంటల పాటు సహాయకులతో కలిసి జరిగిన చర్చలు ఆకస్మికంగా ముగిశాయి.
అయినప్పటికీ, ఈ భేటీ "అత్యంత ఫలప్రదంగా" జరిగిందని ట్రంప్ అభివర్ణించారు. "మేమింకా ఒప్పందానికి చేరుకోలేదు, కానీ పురోగతి సాధించాం. తుది ఒప్పందం కుదిరే వరకు ఏదీ కుదిరినట్టు కాదు" అని ఆయన వ్యాఖ్యానించారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పినప్పటికీ, ఆ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.