Donald Trump: భారత్‌-పాక్‌ యుద్ధంపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump Claims to Avert India Pakistan Nuclear War
  • అణుయుద్ధం దాకా వెళితే తానే అడ్డుకున్నానని కామెంట్
  • రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ వేళ ట్రంప్ స్పందన
  • పలు అంతర్జాతీయ సంక్షోభాలను నివారించానంటూ స్కోత్వర్ష
పాడిందే పాట అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. భారత్ – పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు అణుయుద్ధం వరకూ వెళ్లాయని, తానే కల్పించుకుని ఆపానని చెప్పారు. పాక్ తో కాల్పుల విరమణ విషయంలో విదేశీ జోక్యం లేదని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్నా ట్రంప్ తన ధోరణి మార్చుకోవడంలేదు.

పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు. ఓ దశలో ఇరు దేశాలు అణ్వాయుధ దాడులకు సిద్ధమయ్యాయని చెప్పారు. దాంతో తాను కల్పించుకోవాల్సి వచ్చిందని, యుద్ధం వెంటనే ఆపకపోతే ఇరు దేశాలతో అమెరికా ఎలాంటి వ్యాపార సంబంధాలు కుదుర్చుకోబోదని హెచ్చరించానని వివరించారు.

ఈ బెదిరింపులతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. దీంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంక్షోభాలను తానే నివారించానని ట్రంప్ ప్రకటించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ వేళ వైట్ హౌస్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Donald Trump
India Pakistan war
Trump mediation
Nuclear war averted
Pahalgam terror attack
India Pakistan conflict
Vladimir Putin
US trade relations
Ceasefire agreement

More Telugu News