Hyderabad: హైద‌రాబాద్‌లో ప‌ట్టుబ‌డ్డ పాక్ యువ‌కుడు.. పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి షాకింగ్‌ విష‌యాలు

Fahad Pakistani youth love affair in Hyderabad exposed
  • బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో స్థిర‌ప‌డ్డ ఫ‌హ‌ద్‌ 
  • హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న పాక్‌ యువకుడు 
  • అదే కంపెనీలో ప‌నిచేసే కీర్తిని ప్రేమించి, మతం మార్చి పెళ్లి చేసుకున్న వైనం
  • ఆ త‌ర్వాత అదే సంస్థ‌లో ప‌నిచేసే మ‌రో మ‌హిళ‌తో సాన్నిహిత్యం
  • రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన భార్య‌  
  • పోలీసుల విచార‌ణ‌లో ఫ‌హ‌ద్ గురించి వెలుగులోకి విస్తుపోయే విష‌యాలు
హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థాన్ యువకుడి రాసలీలు వెలుగులోకి వ‌చ్చాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే యువ‌తిని పాక్‌ యువ‌కుడు ఫ‌హ‌ద్‌ ప్రేమించాడు. కీర్తి మతం మార్చి, ఆమె పేరును దోహా ఫాతిమాగా మార్చాడు.  2016లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఈ జంట‌ హైద‌రాబాద్‌లోనే ఉంటూ జీవ‌నం సాగిస్తున్నారు.

అయితే, సిపాల్ కంపెనీలోనే పనిచేసిన మరో మహిళతో రాస‌లీలు కొన‌సాగిస్తుండ‌గా ఫహద్‌ను భార్య‌ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. అనంత‌రం ఆమె పోలీసుల‌కు స‌మాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేర‌కు ఫ‌హ‌ద్‌తో పాటు మ‌రో మ‌హిళ‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం వారిద్ద‌రిని బంజారాహిల్స్ పీఎస్‌కు త‌ర‌లించారు. 

కాగా, పోలీసుల విచార‌ణ‌లో ఫ‌హ‌ద్ గురించి విస్తుపోయే విష‌యాలు తెలిశాయి. 1998లో పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన అత‌డు హైదరాబాద్‌లో స్థిర‌ప‌డ్డాడు. అమ్మాయిల మతం మార్చి ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న‌ట్లు పోలీసుల‌కు తెలిసింది. దీంతో ఫహద్ పూర్తి వివరాల‌ను తెలుసుకునే ప‌నిలో పోలీసులు ఉన్నారు.


Hyderabad
Pakistan
Love affair
Religious conversion
Banjara Hills
Fahad
Cyberabad Police
Cheating case
Doha Fatima
Mount Banjara Colony

More Telugu News