Balakrishna: పులివెందులకు పూర్వ వైభవం వచ్చింది: బాలకృష్ణ

Balakrishna Says Pulivendula Regained Former Glory
  • పులివెందులలో ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందన్న బాలయ్య
  • పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్య
  • ప్రజలు ధైర్యంగా ఓటు వేశారన్న బాలయ్య
పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. గతంలో పులివెందులలో ఎన్నికలు అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని... ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పులివెందులకు పూర్వవైభవం వచ్చిందని బాలయ్య చెప్పారు. ప్రజలు భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. గతంలో నామినేషన్ వేయడానికే భయపడేవారని... ఇప్పుడు మాత్రం స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని చెప్పారు.
Balakrishna
Pulivendula
TDP
Andhra Pradesh Politics
ZPTC Election
Telugu Desam Party
AP Elections
Democracy
Political News

More Telugu News