Leander Paes: లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ కన్నుమూత

Leander Paes father Vece Paes passed away
  • 80 ఏళ్ల వయసులో కన్నుమూసిన వేస్ పేస్
  • భారత్ తరపున హాకీ ఆడిన వేస్ పేస్
  • 1972 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పేస్
భారత టెన్నిస్ స్టార్ లియాండ్ పేస్ తండ్రి వేస్ పేస్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. వృత్తి రీత్యా స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ అయిన వేస్ పేస్... హాకీ ఆటగాడిగా కూడా రాణించారు. 1972లో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన హాకీ జట్టు సభ్యుల్లో వేస్ పేస్ ఒకరు. 1945 లో గోవాలో వేస్ పేస్ జన్మించారు. హాకీలో మిడ్ ఫీల్డర్ గా ఆయన గొప్పగా రాణించారు. 

మన దేశ చరిత్రలో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన తండ్రీకొడుకులుగా వేస్ పేస్, లియాండర్ పేస్ నిలిచారు. 1996 ఒలింపిక్స్ లో టెన్నిస్ సింగిల్స్ లో లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించారు. వేస్ పేస్ భార్య కూడా క్రీడాకారిణి కావడం గమనార్హం. భారత మహిళల బాస్కెట్ బాల్ జట్టుకు ఆమె కెప్టెన్ గా వ్యవహరించారు. 1972 ఒలింపిక్స్ లో ఆమె భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. 
Leander Paes
Vece Paes
Leander Paes father
Indian Hockey
Olympics Medal
Sports Medicine Doctor
Indian Tennis
1972 Olympics

More Telugu News