War 2: ఈరోజు థియేటర్లలో మారణహోమం జరుగుతుంది.. 'వార్‌2'పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌

There will be CARNAGE in theatres today Proud of War2 says Jr NTR
  • హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్ హీరోలుగా 'వార్‌2' 
  • ఆయన్ ముఖర్జీ దర్శకత్వం.. యశ్‌ రాజ్ ఫిలింస్ నిర్మాణం
  • ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్
  • ఈ నేప‌థ్యంలో తార‌క్ స్పెష‌ల్ ట్వీట్‌
బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోషన్‌, యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ హీరోలుగా ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం 'వార్‌2'. ఈ మూవీ ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సినిమాపై తారక్ అంచ‌నాలు పెంచేశారు. "ఇది యుద్ధం. ఇవాళ థియేట‌ర్ల‌లో మార‌ణ‌హోమం జరుగుతుంది. వార్‌2 ప‌ట్ల గ‌ర్వంగా ఉంది. దీనిపై మీ రియాక్ష‌న్స్ తెలుసుకునేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. మీకు సమీపంలోని సినిమాహాళ్లలో మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి!" అంటూ ట్వీట్ చేశారు. 

దీంతో అభిమానులు "కొడుతున్నాం అన్న" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక‌, ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయమైతే.. హృతిక్ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బాలీవుడ్‌ పాప్యులర్ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందించిన 'వార్2' చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించారు. కాగా, మ‌రికొన్ని గంట‌ల్లో ఈ మూవీ ఎలా ఉంద‌నే విష‌యం తెలిసిపోనుంది.
War 2
Jr NTR
Hrithik Roshan
Ayan Mukerji
Bollywood
Tollywood
Kiara Advani
Yash Raj Films
Aditya Chopra
Indian Cinema

More Telugu News