Sajjanar: రాఖీ పండుగ.. ఆర్టీసీలో రికార్డు స్థాయిలో మహిళల ప్రయాణాలు

Sajjanar says record number of women traveled by TSRTC for Rakhi
  • ఆరు రోజుల్లో 3.68 కోట్ల రాకపోకలు
  • 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నట్లు ఆర్టీసీ వెల్లడి
  • 7 నుంచి 12వ తేదీ వరకు ప్రయాణాలు
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు రికార్డు స్థాయిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు సాగించారు. ఆగస్టు 7 నుంచి 12వ తేదీ వరకు ఈ ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా, అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ రోజున 45.62 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని సజ్జనార్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారని, ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.

గత ఏడాది రాఖీ పండుగకు 2.75 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశామని, అప్పటితో పోలిస్తే ఈ సంవత్సరం 92.95 లక్షల మంది ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆయన తెలిపారు. ఈ ఏడాది బస్సులు 2.28 కోట్ల కిలోమీటర్ల మేర తిరిగాయని, గత ఏడాదితో పోలిస్తే 53 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయని ఆయన వెల్లడించారు.
Sajjanar
TSRTC
Rakhi Festival
Telangana RTC
Free Bus Travel
Women Travel
Bus Services
Raksha Bandhan

More Telugu News