Mohammed Wasey: హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన కార్పొరేటర్!

Corporator Rescues Man Who Fell into Drain in Hyderabad
  • మేకకు మేత తీసుకురావడానికి వెళ్లి పట్టుతప్పి నాలాలో పడిపోయిన గౌస్
  • నాలా పక్కన ఆకులు కోస్తున్న సమయంలో సంఘటన
  • స్థానికుల సహాయంతో కాపాడిన కార్పొరేటర్ మహ్మద్ వాసె
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో ప్రమాదవశాత్తూ నాలాలో పడిన వ్యక్తిని కార్పొరేటర్, స్థానికులు కలిసి రక్షించారు. ఈ సంఘటన యాకుత్‌పురా పరిధిలో జరిగింది. గౌస్ అనే వ్యక్తి తన మేక కోసం మేత తీసుకురావడానికి వెళ్లి కాలు జారి నాలాలో పడిపోయాడు.

నాలా పక్కనే ఆకులు కోస్తున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గౌస్ నాలాలో పడిపోయిన సమాచారం తెలియడంతో స్థానిక కార్పొరేటర్ మహ్మద్ వాసె వెంటనే స్పందించి స్థానికుల సహాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీశారు. గౌస్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Mohammed Wasey
Hyderabad
Yakutpura
Old City Hyderabad
Drain Rescue
Ghouse
Telangana Floods

More Telugu News