Jr NTR: 'కహో నా ప్యార్ హై' చూసి నాకు పిచ్చెక్కిపోయింది: హృతిక్‌పై ఎన్టీఆర్ ప్రశంసలు
- రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న 'వార్ 2'
- సహనటుడు హృతిక్ రోషన్‌పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- హృతిక్ తొలి సినిమా చూసి పిచ్చెక్కిపోయానన్న తారక్
- దేశంలోనే గొప్ప డ్యాన్సర్లలో హృతిక్ ఒకరని ప్రశంస
- ఇది తన బాలీవుడ్ ఎంట్రీ కాదని, హృతిక్ టాలీవుడ్ ఎంట్రీ అని వ్యాఖ్య
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్థార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తన సహనటుడు హృతిక్ రోషన్‌పై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన సినీ ప్రయాణం మొదలైన నాటి నుంచి హృతిక్‌ను ఎంతగానో ఆరాధిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, "చాలా ఏళ్ల క్రితం హృతిక్ రోషన్ గారి తొలి చిత్రం 'కహో నా ప్యార్ హై' చూసినప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది. నా కెరీర్, ఆయన కెరీర్ దాదాపు ఒకే సమయంలో మొదలయ్యాయి. ఆయన దేశంలోనే అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకరు. అలాంటి వ్యక్తిని ఆరాధిస్తూ పెరిగాను. ఇన్నేళ్ల తర్వాత ఆయనతో కలిసి నటించి, డ్యాన్స్ చేసే అవకాశం రావడం నా అదృష్టం" అని తన సంతోషాన్ని పంచుకున్నారు.
అంతేకాకుండా, 'వార్ 2' చిత్రాన్ని తన బాలీవుడ్ ఎంట్రీగా చూడవద్దని, ఇది హృతిక్ రోషన్ తెలుగు సినీ రంగ ప్రవేశమని ఎన్టీఆర్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. "ఇది ఎన్టీఆర్ హిందీ సినిమాకు వెళ్లడం కాదు. నిజానికి హృతిక్ గారే తెలుగు సినిమాలోకి వస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు డైలాగులను ఆయనే స్వయంగా చెప్పారు" అని వివరించారు. ఈ స్థాయికి రావడానికి కారణమైన తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు హృతిక్ రోషన్ కూడా 'వార్ 2'పై అంచనాలను పెంచారు. "ఈసారి కబీర్ పాత్ర మరింత తీవ్రంగా, మానసిక సంఘర్షణతో కనిపిస్తుంది. 'వార్ 2' ప్రేక్షకులు తప్పక చూడాల్సిన సినిమా అవుతుంది" అని ఆయన అన్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించారు. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల కానుంది.