Bed Room Jihadi: అసలు ఎవరీ బెడ్ రూం జిహాదీలు...?

Bed Room Jihadi The New Threat in Kashmir
  • జమ్మూకశ్మీర్ లో రెచ్చిపోతున్న బెడ్ రూం జిహాదీలు
  • ప్రజల మధ్య మత కలహాలు, కులాల మధ్య చిచ్చు రేపుతున్న జిహాదీలు
  • సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా విధ్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు
జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకలతో దశాబ్దాలుగా ప్రత్యక్షంగా పోరాడుతున్న భద్రతా బలగాలకు ప్రస్తుతం రహస్య శత్రువుల రూపంలో కొత్త సవాల్ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, సమాచారాలను వ్యాప్తి చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్న బెడ్‌రూమ్ జిహాదీలు సైన్యానికి సవాల్ విసురుతున్నారు.

సాంప్రదాయ తీవ్రవాదానికి భిన్నంగా ఉండే ఈ మూకలు కశ్మీర్‌లో అలజడులు సృష్టించి అస్థిరపరిచే కుట్రలకు తెరతీసినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం సోషల్ మీడియాలో అనేక నకిలీ ఖాతాలను తెరిచినట్లు గుర్తించామని నిఘా అధికారులు తెలిపారు.

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు, వాటి సానుభూతిపరులు ఈ నెట్‌వర్క్‌ను నియంత్రిస్తున్నట్లు భావిస్తున్నారు. గత కొద్ది వారాలుగా సాగుతున్న దర్యాప్తులో వేలాది ఆన్‌లైన్ పోస్టులు, ప్రసంగాలు, ప్రైవేటు సందేశాలను అధికారులు విశ్లేషించారు. ఈ పరిశీలనలో పాక్‌లో ఉన్న హ్యాండ్లర్లకు ఈ సంఘ విద్రోహక మూకలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలు లభించాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల సహాయంతో ఈ జిహాదీలు ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తారని, వదంతులు వ్యాప్తి చేస్తూ యువతను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అధికారులు తెలిపారు.

ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్థానికంగా ఇరువర్గాల మధ్య చిచ్చు పెట్టగా, శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. మరో కేసులో ఒక వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని చెప్పారు. ఈ వ్యవహారంలో ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, పాక్ నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయని అతను పేర్కొన్నాడని అధికారులు వెల్లడించారు. 
Bed Room Jihadi
Kashmir
Jammu and Kashmir
Social Media
Terrorism
Pakistan
Srinagar
Online radicalization

More Telugu News