Santosh Kumar Sharma: ఉన్నతాధికారుల జూమ్ మీటింగ్‌లో బూతు వీడియో ప్రత్యక్షం!

Obscene video appears in officials Zoom meeting
  • ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఘటన 
  • విద్యారంగ సమస్యలపై జూమ్ మీటింగ్ నిర్వహించిన సందర్భంలో అనూహ్య ఘటన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్లాక్ ఎడ్యుకేషనల్ అధికారి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మహరాజ్‌గంజ్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా అశ్లీల వీడియో ప్రత్యక్షం కావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

జిల్లా మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ శర్మ అధ్యక్షతన ఈ నెల 7న విద్యాశాఖ సమస్యలపై చర్చించేందుకు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది సమస్యల పరిష్కారంపై చర్చ జరుగుతున్న సమయంలో, ఊహించని విధంగా Jason Jr అనే వ్యక్తి పేరుతో ఉన్న స్క్రీన్ నుంచి అశ్లీల వీడియో ప్లే కావడంతో సమావేశంలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో అధికారులు వెంటనే జూమ్ సమావేశాన్ని నిలిపివేశారు.

ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బ్లాక్ ఎడ్యుకేషనల్ అధికారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ క్రైమ్ విభాగం ద్వారా సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
Santosh Kumar Sharma
Uttar Pradesh
Maharajganj
Zoom meeting
obscene video
cyber crime
school education
district magistrate

More Telugu News