Gautam Gambhir: రోహిత్ శర్మ, కోహ్లీ వన్డే భవిష్యత్తుపై చర్చ.. స్పందించిన గౌతమ్ గంభీర్

Gautam Gambhir Responds to Rohit Sharma Kohli ODI Future Debate
  • సరైన ప్రదర్శన చేస్తున్నంత వరకు వయస్సు సంఖ్య మాత్రమేనన్న గంభీర్
  • 2027 ప్రపంచ కప్‌కు ఇంకా చాలా సమయం ఉందని వ్యాఖ్య
  • 2026లోని టీ20 వరల్డ్ కప్ మీద దృష్టి పెట్టామన్న గంభీర్
క్రికెట్‌లో ఆటగాళ్లు సత్తా చాటుతున్నంత కాలం వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవితవ్యంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు గంభీర్ ఈ విధంగా స్పందించాడు.

2027 ప్రపంచ కప్‌నకు ఇంకా చాలా సమయం ఉందని, అంతకంటే ముందు 2026లో టీ20 వరల్డ్ కప్ జరగనుందని గౌతమ్ గంభీర్ గుర్తు చేశాడు. తమ ముందున్న లక్ష్యం ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ అని స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచ కప్‌నకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నంత వరకు వయస్సు అడ్డంకి కాదని తేల్చి చెప్పాడు.
Gautam Gambhir
Rohit Sharma
Virat Kohli
India Cricket
ODI Cricket
T20 World Cup 2026

More Telugu News