Sreeja Varma: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థిని శ్రీజ మృతి

Sreeja Varma Hyderabad student dies in US road accident
  • సోమవారం రాత్రి ప్రమాదం
  • రెస్టారెంట్‌లో భోజనం చేసి వస్తుండగా కారును ఢీకొట్టిన ట్రక్కు
  • అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన శ్రీజ
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‍కు చెందిన విద్యార్థిని శ్రీజ వర్మ దుర్మరణం చెందింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఆమె తన అపార్ట్‌మెంట్ నుంచి భోజనం కోసం కారులో రెస్టారెంటుకు వెళ్లింది. తిరిగి వస్తుండగా కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శ్రీజ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె స్నేహితురాలు కూడా కారులో ఉన్నట్లు సమాచారం. శ్రీజ వర్మ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది.

సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజ వర్మ, శ్రేయ వర్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. వారు మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణనగర్‌లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా పని చేస్తుండగా, ఆయన భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు శ్రేయా వర్మ కూడా ఎంఎస్ చేసేందుకు 20 రోజుల క్రితం అమెరికా వెళ్లింది.
Sreeja Varma
Sreeja Varma accident
Hyderabad student death
US road accident
Road accident in America

More Telugu News